తమిళనాడు రాష్ట్రం మదురైలోని ముక్తీశ్వర ఆలయంలో ఏడాది చివరి సూర్యోదయం స్పెషల్ అని చెప్పవచ్చు. ఇక్కడ ప్రతి ఏడాది డిసెంబర్ 31న చివరి సూర్యోదయం సమయంలో ప్రత్యేక ఉత్సవం నిర్వహిస్తారు.
ఆ సమయంలో ఆలయానికి భక్తులు విచ్చేసి ప్రార్థనలు చేస్తారు. సూర్యోదయం సమయంలో సూర్యుడు ఆలయంవైపు ప్రత్యక్షంగా దర్శనమిస్తాడు. ఇది అక్కడికి వచ్చిన భక్తులకు ఎంతో ఉత్సాహాన్ని ఇవ్వడంతోపాటు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది.