బీజీటీ సిరీస్‌లో భాగంగా సిడ్నీలో జరిగే ఐదవ టెస్టుకు ముందు అస్ట్రేలియాకు భారీ షాక్ తగిలేలా ఉంది. బాక్సింగ్ టెస్ట్‌లో ఆసిస్ పేసర్ మిచెల్ స్టార్క్ కొంత నిస్సహాయతకు గురైన సంగతితెలిసిందే.
తాజాగా మిచెల్ స్టార్క్‌కు గాయం ఉందని ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ అంగీకరించాడు. అయితే, స్టార్క్ రాబోయే టెస్టుకు ముందు ఫిట్‌గా ఉంటాడని మెక్‌డొనాల్డ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.