కొత్త సంవత్సరంలో అదృష్టం, ఐశ్వర్యం రావాలంటే కొన్ని పనులు చేయాలని పండితులు చెబుతున్నారు. 31న ఉదయాన్నే స్నానం చేసి పూజ గదిలో దక్షిణ దిక్కులో ఓ పీట ఏర్పాటు చేసి దానిపై బియ్యం పిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేయాలి. దాని మధ్యలో ప్రమిదను పెట్టి దీపారధన చేయాలి. ఇంకా నానబెట్టిన కందులు, బెల్లం కలిపి గోమాతకు తినిపించాలి. 31వ తేదీన అర్ధరాత్రి లక్ష్మీదేవి పటానికి దీపారాధన చేయాలి. ఇలా చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని అంటున్నారు.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొత్త సంవత్సరం మొదటి రోజున ఇంట్లో తులసి మొక్కను నాటండి. దీని తరువాత, ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజించండి. తులసి లక్ష్మీదేవికి ప్రతి రూపంగా పరిగణించబడుతుంది. అందుకే తులసిని పూజించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉంటుంది.