ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ప్లేయర్, ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ( David Warner ) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలంలో… డేవిడ్ వార్నర్ను ఎవరు కొనుగోలు చేయకపోవడంతో షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.2025 పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడేందుకు నిర్ణయం తీసుకున్నాడట డేవిడ్ వార్నర్. ఇందులో భాగంగానే పాకిస్తాన్ సూపర్ లీగ్ డ్రాప్టింగ్ ప్రక్రియ కోసం కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడట డేవిడ్ వార్నర్ .దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంవత్సరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (లో ఆడే అవకాశం డేవిడ్ వార్నర్ కు లేకపోవడంతో… పాకిస్తాన్లో జరిగే టి20 టోర్నమెంటులో ఆడెందుకు డిసైడ్ అయ్యాడట. దీనికోసం పాకిస్తాన్ సూపర్ లీగ్ ( డ్రాప్టింగ్ ప్రక్రియ కోసం పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడట ఆ డేవిడ్ వార్నర్. జనవరి 11వ తేదీన… పాకిస్తాన్ సూపర్ లీగ్ కు సంబంధించిన తదుపరి ఎడిషన్ కోసం ఆటగాళ్ల డ్రాప్టింగ్ ప్రక్రియ జరగనుంది. ఈ డ్రాప్టింగ్ ప్రక్రియ బలిచిస్తాన్లో ఉన్న పోర్ట్ సిటీ గ్వదర్ లో నిర్వహించబోతున్నారు. ఈ మేరకు పాకిస్తాన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్ ఆడుతున్న డేవిడ్ వార్నర్… త్వరలోనే పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడేందుకు నిర్ణయం తీసుకున్నాడు. డేవిడ్ వార్నర్ ఒక్కడే కాదు… అతనితోపాటు న్యూజిలాండ్ మాజీ బౌలర్ టీం సౌతీ కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 ప్లేయర్స్ డ్రాఫ్ట్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడిన ఏ ఒక్క ప్లేయర్ ను కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోకి తీసుకోరు.ఆ విషయం తెలుసుకొని ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు.. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు పోటీగా కుట్ర పన్ని మరి పాకిస్తాన్ సూపర్ లీగ్ నిర్వహిస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఐపీఎల్ టోర్నమెంట్ను తక్కువ చేసేందుకు ప్రతిసారి ఏదో ఒక కుట్ర చేస్తూనే ఉంటుంది పాకిస్తాన్. అందుకే ఐపీఎల్లో ఆడిన ప్లేయర్లకు ప్రాధాన్యత కూడా ఇవ్వనుంది పాకిస్తాన్. అందుకే డేవిడ్ వార్నర్ను ఏరుకోరి తెచ్చుకుంటోందట పాక్.
ఇది ఇలా ఉండగా ఆస్ట్రేలియా డేంజర్ ఆటగాడు డేవిడ్ వార్నర్… గతంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఒకసారి హైదరాబాద్ జట్టును ఛాంపియన్గా కూడా నిలిపాడు డేవిడ్ వార్నర్. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కానీ.. డేవిడ్ వార్నర్ పూర్ ఫాం కారణంగా… అతని మొన్నటి వేలంలో ఎవరు కొనుగోలు చేయలేదు.