BGTలో పేలవ ప్రదర్శన చేయడంతో సీనియర్ ఆటగాళ్లు రిటైర్ అవ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే కోహ్లి కన్నా రోహిత్ పై ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. కానీ 2024లో రన్ మెషీన్ తో పోలిస్తే హిట్ మ్యానే మెరుగైన ప్రదర్శన చేశారు. 3 ఫార్మాట్లలో 28 మ్యాచులాడిన అతడు 31.18 AVG, 86.83 SRతో 1154 పరుగులు చేశారు. 3 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 23 మ్యాచులాడిన విరాట్ 21.83 AVG, 73.38 SRతో చేసింది 655 రన్సే. 1 సెంచరీ, రెండు 50లు ఖాతాలో ఉన్నాయి.