మెల్‌బోర్న్ టెస్టులో ఓటమి నేపథ్యంలో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం పూర్తిగా వేడెక్కినట్లు తెలుస్తోంది. ఓటమి అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగివచ్చిన ఆటగాళ్లపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మండిపడినట్లు సమాచారం. ఇప్పటినుంచి జట్టు వ్యూహాలకనుగుణంగా ఆడని వారిపై వేటు వేసే దిశగా చర్యలు ఉంటాయని గంభీర్ ఆటగాళ్లకు సంకేతాలు ఇచ్చినట్లు పలువురు సభ్యులు చెబుతున్నారు.