టీమిండియా యంగ్ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవార్కర్ ప్రశంసలతో ముంచెత్తాడు. భారత క్రికెట్ భవిష్యత్ స్టార్‌గా పేర్కొన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన నితీశ్ రెడ్డి.. నాలుగో టెస్టులో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుత సెంచరీ కొట్టాడు. నితీశ్ టెస్టు కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ ప్లేయర్.. సత్తాచాటాడు.
ఈ నేపథ్యంలో మాట్లాడిన సునీల్ గవాస్కర్.. నితీశ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు భారత భవిష్యత్ స్టార్ అని కొనియాడాడు. ఈ క్రమంలోనే సునీల్ గవాస్కర్.. నితీశ్ కుమార్ రెడ్డిని.. భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాతో పోల్చాడు. హార్దిక్ పాండ్యా కెరీర్ ఆరంభఁలో ఆడిన దానికంటే నితీశ్ కుమార్ రెడ్డి మెరుగైనప్రదర్శన చేస్తున్నాడన చెప్పుకొచ్చాడు. అతడిలోని ప్రతిభను గుర్తించిన సెలక్టర్లను సైతం కొనియాడాడు.
"మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్టు.. భారత క్రికెట్‌లో ఓ ప్రతిభావంతుడైన క్రికెటర్‌ను వెలుగులోకి తెచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పుణ్యమా అని నితీశ్ కుమార్ రెడ్డి వెలుగులోకి వచ్చాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడ అందరి దృష్టిలో పడ్డాడు. అయితే ఇదే సమయంలో నేను సెలక్టర్లను అభినందిస్తున్నా. ఎందుకంటే.. నితీశ్‌కు దేశవాళీలో అంత గొప్ప రికార్డులు ఏమీ లేవు. కానీ అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్టర్లు అతడికి టెస్టు జట్టులో చోటు కల్పించారు. అరంగేట్ర టెస్టులోనే.. అతడి పట్టుదల కనిపించింది. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడ సత్తా ఉందని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత మరింత మెరుగైన ప్రదర్శన చేశాడు" అని సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు.
ఇదే సమయంలో హార్దిక్ పాండ్యాతో.. నితీశ్ రెడ్డిని పోల్చాడు. "మెల్‌బోర్న్‌లో భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సెంచరీతో ఆదుకున్నాడు నితీశ్. హార్దిక్ పాండ్యా తన కెరీర్ తొలి నాళ్లలో ఆడినదానికంటే కూడా నితీశ్ రెడ్డి మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. హార్దిక్ పాండ్యా టెస్టులు ఆడటం లేదు. దీంతో సుదీర్ఘ ఫార్మాట్లో మీడియం పేస్ ఆల్ రౌండర్ కోసం భారత్ వెతుకుతోంది. ఈ అవకాశాన్ని నితీశ్ చక్కగా ఉపయోగించుకున్నాడు" అని సునీల్ గవాస్కర్ నితీశ్ రెడ్డిని పొగిడాడు. కాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నితీశ్ రెడ్డి.. ఇప్పటి వరకు 294 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ మూడు వికెట్లు పడగొట్టాడు.