అయోధ్యలోని రామాలయంలో రాంలాలాకు పట్టాభిషేకం జరిగిన మొదటి వార్షికోత్సవానికి సన్నాహాలు సాగుతున్నాయి. తొలి వార్షికోత్సవం జనవరి 11న నిర్వహించబడుతుంది.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ మాట్లాడుతూ.. జనవరి 11 నుంచి 13 వరకు శ్రీరామ మందిర VIP దర్శనం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసివేయనున్నట్లు తెలిపారు.