కుంభమేళాకు వచ్చే లక్షలాది మంది యాత్రికులు సంగమ స్నానం ముగించుకున్నాక నేరుగా వారణాసికి వచ్చి, గంగలో స్నానం చేసి విశ్వనాథుని దర్శనం చేసుకుంటారు. ఈవిధంగా చూస్తే కుంభమేళా సందర్భంగా కాశీకి వచ్చే యాత్రికుల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది.
కుంభమేళా రోజుల్లో విశ్వనాథుని దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాశీవిశ్వనాథ్ ట్రస్ట్ స్వామివారి దర్శన సమయాల్లో మార్పులు చేసింది.