పెరుగు జుట్టుని హైడ్రేట్‌గా మార్చడంలో హెల్ప్ చేస్తాయి. ఇందులో లాక్టిక్ యాసిడ్ జుట్టుకి చాలా బాగా పనిచేస్తుంది. పెరుగు జుట్టుని మూలాల నుండి బలంగా చేస్తుంది. పెరుగులో ప్రోటీన్స్, విటమిన్స్, హెల్దీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుని లోపల నుంచి అందంగా తేమ కోల్పోకుండా చేస్తాయి. కోల్పోయిన తేమని తిరిగి పొందేందుకు పెరుగు చాలా బాగా పనిచేస్తుంది. దీంతో జుట్టు మృదువుగా, అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా, పొడిగా, డ్రైగా ఉండే జుట్టుకి కూడా పెరుగు చాలా మంచిది. పెరుగుని రెగ్యులర్‌గా అప్లై చేస్తే జుట్టు అందంగా కనిపిస్తుంది.
హెయిర్ ఫాల్ తగ్గించే.. రైస్ హెయిర్ మాస్క్
కొబ్బరినూనె
జుట్టు పెరుగుదలకి కొబ్బరినూనె చాలా బాగా పనిచేస్తుంది. కొబ్బరినూనెలో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టుని కుదుళ్ల నుంచి బలంగా చేస్తాయి. కొబ్బరినూనె జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది జుట్టు చిట్లడాన్ని తగ్గించి పొడిబారకుండా చేస్తుంది. అంతేకాకుండా, జుట్టుకి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. జుట్టులో కోల్పోయిన ప్రోటీన్స్‌ని అందిస్తుంది. దీనిని రాయడం వల్ల చుండ్రుని తగ్గించి ఎండ వల్ల జుట్టుకి వచ్చే సమస్యల్ని కూడా తగ్గిస్తుంది.
అన్నం గంజి
అన్నం, గంజి నీరు జుట్టుకు చాలా మంచిది. వెంట్రుకల్ని మృదువుగా మార్చడానికి అన్నం ఎంతగానో మంచిది. హెయిర్‌ఫాల్‌ని తగ్గించి, జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో అన్నం చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అన్నాన్ని వాడడం వల్ల వెంట్రుకలు మెరుస్తూ, మృదువగా మారతాయి. ఉడకబెట్టిన అన్నాన్ని గ్రైండ్ చేసి ఈ మాస్క్ తయారు చేస్తారు. దీని వల్ల జుట్టు అందంగా మారుతుంది.
ప్యాక్ ఎలా తయారు చేయాలి
దీనికోసం రెండు చెంచాలా అన్నాన్ని తీసుకోండి. అందులో 2 చెంచాల పెరుగు, గంజి వేసి కలపండి. దీనిలోనే కొద్దిగా కొబ్బరినూనె వేయండి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి ప్యాక్‌లా చేయండి. దీనిని జుట్టుకి, కుదుళ్లకి అప్లై చేయండి. దీంతో జుట్టు, స్కాల్‌కి మసాజ్ చేయండి. 20 నిమిషాల తర్వాత ఈ ప్యాక్‌ని క్లీన్ చేయండి. దీంతో జుట్టు ఒత్తుగా, అందంగా పెరుగుతుంది.