ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఇటీవల ఎనిమిది రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్లకు సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షా తేదీలను తాజాగా ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు సంస్థ కార్యదర్శి నరసింహమూర్తి ప్రకటన జారీ చేశారు. మెుత్తం పరీక్షలను ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఏపీ టౌన్ ప్లానింగ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్ ఉద్యోగాలకు ఏప్రిల్ 28, 29 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేట్ సర్వీసుల్లో లైబ్రేరియన్ పోస్టులకు ఏప్రిల్ 27, 28 తారీకుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.