సంక్రాంతి పండుగ వేళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్జీవో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ తెలిపారు.
పోలీసుల సరెండర్ లీవ్, ఉద్యోగుల జీపీఎఫ్, మెడికల్ రీయింబర్స్‌మెంట్, ఎఫ్‌టీఏ బిల్లులు అకౌంట్స్‌తో జమ కానున్నాయి. సుమారు రూ.2 వేల కోట్లు బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు.