ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు కోలాహలంగా సాగుతున్నాయి. సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్, నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర సహా ఇతర కుటుంబసభ్యులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని సందడి చేశారు.మహిళలకు ముగ్గుల పోటీలు, విద్యార్థులకు పలు ఆటల పోటీలను నిర్వహించారు. భువనేశ్వరి, బ్రాహ్మణి మహిళలు వేసిన ముగ్గులను వీక్షించారు. ముగ్గుల పోటీల్లో 126 మంది మహిళలు పాల్గొనగా వారందరికీ 10 వేల 116 రూపాయల చొప్పున నగదు బహుమతిని భువనేశ్వరి అందజేశారు.అనంతరం సీఎం కుటుంబసభ్యులతో కలిసి ఆటల పోటీలను ఆసక్తిగా తిలకించారు.