పమిడిముక్కల మండలం చోరగుడి జడ్పీ హైస్కూల్లో 2003-04 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు అపూర్వ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆనాటి విద్యార్థులందరూ కుటుంబ సమేతంగా కార్యక్రమానికి హాజరై ఆనాటి తీపి గుర్తులను, మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, ఒకరితో మరొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఎంతో ఆనందంగా గడిపారు.