తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ వెల్లివిరుస్తోంది. తొలిరోజు భోగి సందర్భంగా తెల్లవారుజాము నుంచే సందడి మొదలైంది. ఇప్పటికే పట్టణాల నుంచి పల్లెలకు అంతా చేరుకున్నారు. ముఖ్యంగా ఏపీ వ్యాప్తంగా వేకువ జామునే వీధుల్లో, ఇళ్ల ముందు భోగి మంటలు వేశారు. ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా కోడి పందేలను ఎమ్మెల్యే గళ్లా మాధవి సోమవారం ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.