సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని సూరంపల్లి, రామవరప్పాడు, అంపాపురంలో వీటిని నిర్వహించారు. పల్లెల్లోని బరుల్లోనూ పందేలు ఏర్పాటు చేశారు. వీటిని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. నందిగామ, చందర్లపాడులో ఈ పోటీలు సాగుతున్నాయి. కంచికచర్ల మండలం గండేపల్లి వద్ద టెంట్లు ఏర్పాటు చేసి భారీ ఎత్తున పందేలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరంలో కోడి పందేలను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ప్రారంభించారు.