కర్నూలు జిల్లా అఫీషియల్ స్పోక్స్ పర్సన్‌గా ఇప్పల నారాయణ రెడ్డి నియమితులయ్యారు. సోమవారం కల్లూరు అర్బన్ 28వ వార్డు లక్ష్మీపురం గ్రామ నాయకులతో కలిసి జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని పూలమాలలతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. జిల్లాలో వైయస్సార్సీపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్ఆర్సిపి తరుపున పోరాటాలు చేస్తామన్నారు.