చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో భోగి, సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పండుగ సందర్భంగా గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు.
ఈ పోటీల్లో 126 మంది మహిళలు పాల్గొన్నారు. ఆ ముగ్గులను సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి, బ్రహ్మణి పరిశీలించారు. పోటీలో పాల్గొన్న వారందరికీ రూ.10,116 చొప్పున కానుక ఇస్తున్నట్లు నారా భువనేశ్వరి ప్రకటించారు.