దేవరపల్లి మండలం సూర్యనారాయణపురం జాతీయ రహదారిపై బైక్ జారిపడి కడిపల్లి సత్యనాయణ(25) మృతి చెందడంతో అతడి స్వగ్రామమైన బిక్కవోలు మండలం ఊలపల్లిలో విషాధఛాయలు అలుముకున్నా యి. గ్రామానికి చెందిన వీరబాబు, అన్నవరం దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు. కుమార్తెకు పెళ్లవ్వడంతో కుమారుడు సత్యనారాయణే తల్లిదండ్రులను పోషిస్తున్నాడు. తాపీ పని చేసే సత్యనారాయణ హైదరాబాద్ వెళ్లి పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులను తన వద్దే ఉంచుకుంటున్నాడు. ఇటీవల ఊలపల్లిలో ఇల్లు కూడా నిర్మించాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా తల్లిదండ్రులను, ఈ ప్రాంతం నుంచి తాపీ పనికి వచ్చిన వారందరితో వ్యాన్‌లో పంపి సత్యనారాయణ తన బాబాయ్‌తో కలసి బైక్‌పై ఊలపల్లికి వస్తుండగా సూర్యనారాయణపురం వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పండుగ పూట ఊలపల్లిలో విషాధఛాయలు అలుముకున్నాయి.