ధర్మవరం పట్టణ పర్యటనకు విచ్చేసిన మంత్రి సత్య కుమార్ యాదవ్ ను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధు సూధన్ రెడ్డి సోమవారం కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ కు చిల్కం మధు సూధన్ రెడ్డి భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు ఇరువురు పట్టణములో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. 31 వార్డు జనసేన ఇన్చార్జి తోపుదుర్తి వెంకట రాముడు కూడా పాల్గొన్నారు.