ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ ఆసుపత్రి లో మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆకస్మిక త‌నిఖీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 16, 2025, 02:42 PM

మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. అక్కడి రికార్డులను పరిశీలించారు. రోగులకు అందిస్తున్న సేవలపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.


ఆసుపత్రిలో సౌకర్యాలు, సేవలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య కళాశాల స్థాయిలో సౌకర్యాలు లేవని అసహనం వ్యక్తం చేశారు. రోగులను తీసుకెళ్లేందుకు వీల్‌ఛైర్లు కూడా లేకపోవడం దారుణమన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. శౌచాలయాల నిర్వహణ దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చేపట్టిన అభివృద్ధి పనులను ఫిబ్రవరి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని.. లేని పక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com