వాల్నట్స్ క్యాన్సర్‌ను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటాయట. అంతేకాకుండా నిద్రలేమి సమస్య నుంచి కూడా వాల్నట్స్ రక్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు. నిద్ర వచ్చేలా చేసే మెలటోనిన్‌ను పెంచడంలో వాల్నట్స్ సహాయపడతాయి.
గుండెకు
వాల్‌నట్స్‌లో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి శరీరంలో వాపును తగ్గించడంలో కీలకంగా పనిచేస్తాయి. నిజానికి ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే గింజల్లో వాల్నట్స్ కూడా ఒకటి. వీటిలో ఉండే ప్రత్యేక గుణాలు గుండెజబ్బుల నుంచి రక్షణనిస్తాయి.
మెదడుకు
వాల్‌నట్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయని వృద్ధాప్యంతో వచ్చే మానసిక క్షీణతను నెమ్మదించేలా చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి మీ జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా కీలకపాత్ర పోషిస్తాయి.