చియా గింజలను మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక పోషకాలు అందుతాయి. అందులో ఒకటి చియా కర్డ్ పుడ్డింగ్. ఇందులో పెరుగు, క్యారెట్, కీరా లాంటి కూరగాయలు జోడించడం వల్ల రుచికీ రుచి.ఆరోగ్యానికి ఆరోగ్యం. అంతేకాదు ఇది బరువు తగ్గడంలో కూడా సాయపడుతుంది.
చియా కర్డ్‌పుడ్డింగ్ ఎలా తయారు చేసుకోవాలి
కావలసినవి: చియా సీడ్స్ (నల్ల గసగసాలు) - 4 టేబుల్ స్పూన్లు (రెండు గంటల సేపు నానబెట్టాలి); క్యారట్ తురుము-పావు కప్పు; బీట్ రూట్ తురుము-పావుకప్పు, కీరకాయ తురుము-పావుకప్పు. పెరుగు - కప్పు; పచ్చిమిర్చి - 2 (నిలువుగా తరగాలి); దానిమ్మగింజలు -పావుకప్పు ఉప్పు రుచిని బట్టి; ఇంగువ - చిటికెడు; తరిగిన కొత్తిమీర - టేబుల్ స్పూన్;
పోపు కోసం...: నెయ్యి- టీ స్పూన్; ఎండుమిర్చి- 2; కరివేపాకు - 2 రెమ్మలు; పచ్చి శనగపప్పు - గుప్పెడు; వేరుశనగపప్పు - గుప్పెడు.
తయారీ: ఒక పాత్రలో నానబెట్టిన చియా సీడ్స్, పెరుగు, ఉప్పు, ఇంగువ, పచ్చిమిర్చి, క్యారట్ , బీట్‌రూట్, కీరకాయ తురుము వేసి బాగా కలపాలి. ∙ఒక బాణలిలో నెయ్యి వేడి చేసి అందులోఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, వేరుశనగపప్పు వేయించి కరివేపాకు వేసి దించేయాలి. ఈ పోపును పెరుగు మిశ్రమంలో కలపాలి. చివరగా దానిమ్మ గింజలు, కొత్తిమీర చల్లి వడ్డించాలి.
పోషకాలు:
మ్యాక్రో న్యూట్రియెంట్స్:
కేలరీలు - 230;
ప్రొటీన్ - 8 గ్రాములు;
కార్బోహైడ్రేట్‌లు - 20 గ్రాములు;
ఫైబర్- 7 గ్రాములు;
చక్కెర - 6 గ్రాములు;
ఫ్యాట్ - 12 గ్రాములు;
సాచ్యురేటెడ్ ఫ్యాట్ - 3 గ్రాములు;
మైక్రో న్యూట్రియెంట్స్:
క్యాల్షియమ్- 280 మిల్లీగ్రాములు;
ఐరన్- 2.5 మిల్లీగ్రాములు;
మెగ్నీషియమ్- 90 మిల్లీగ్రాములు;
పొటాషియమ్- 450 మిల్లీగ్రాములు;
విటమిన్ సి- 8- 1- మిల్లీగ్రాములు;
విటమిన్ ఏ - 350 మైక్రోగ్రాములు;
ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్‌లు - 3-4 గ్రాములు
అలాగే అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్ చియా కర్డ్ పుడ్డింగ్. అంతేకాదు సులువుగా చేసుకునే అల్పాహారం. స్ట్రాబెర్రీ, దానిమ్మ, యాపిల్, ఇలా పండ్ల ముక్కలను కూడా యాడ్ చేసుకుంటే మరింత ఆరోగ్యకరమైంది కూడా. ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వుతో నిండిన ఈ పుడ్డింగ్ చాలాసేపు పొట్టనిండుగా, సంతృప్తికరంగా ఉంచుతుంది.