అంతరిక్షంలో స్పేడెక్స్ అనుసంధానం విజయవంతం కావడం పట్ల వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ చారిత్రాత్మక ప్రయోగాన్ని చేపట్టిన నాలుగవ దేశంగా భారత్ నిలవడం గర్వకారణమంటూ వైయస్ జగన్ పేర్కొన్నారు. అంతరిక్ష నౌక డాకింగ్ పూర్తి కావడం చారిత్రాత్మక క్షణమని, ప్రతిష్టాత్మక అంతరిక్ష యాత్రలకు కీలకమైన ముందడుగు పడిందంటూ వైయస్ జగన్ తన ఎక్స్‌లో సందేశం పంపించారు.