గురువారం రోజు ఉదయం బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. కోటి రూపాయలు డిమాండ్ చేస్తూ నిందితుడి సైఫ్‌పై కత్తితో దాడి చేయగా.. హీరో తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదంతా ఇలా ఉండగా.. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబయి పోలీసుల్లో మరో అనుమానం మొదలైంది.
ముఖ్యంగా మరో స్టార్ హీరో అయిన షారుక్ ఖాన్ ఇంటిపై ఓ నిందితుడు రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు. అలాగే అతడి ఇంటి పక్కన ఓ నిచ్చెన ఉన్నట్లు సీసీ కెమెరాలో రికార్డు అయింది.. అయితే సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడి ఫస్ట్ టార్గెట్.. షారుక్ ఖాన్‌యే కావొచ్చని ఆ నిందితుడి పొడవు కూడా సైఫ్‌పై దాడి చేసిన నిందితుడికి సమానంగా ఉందని సమాచారం. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గురువారం రోజు ఉదయం 2.30 గంటలకు సైఫ్ అలీఖాన్‌పై ఓ నిందితుడు దాడికి పాల్పడ్డాడు. కోటి రూపాయలు డిమాండ్ చేస్తూ మరీ.. హీరోను ఆరు సార్లు కత్తితో పొడిచాడు. ఈక్రమంలోనే సైఫ్ తీవ్రంగా గాయపడగా.. కుటుంబ సభ్యులు అతడిని లీలావతి ఆసుపత్రికి తరలించారు. శస్త్ర చికిత్స చేసిన వైద్యులు అతడి వెన్నుపూసకు దగ్గర్లో ఇరుక్కుపోయిన కత్తి ముక్కను తొలగించారు. ఆపై రెండు చోట్ల ప్లాస్టిక్ సర్జరీ కూడా చేశారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఇదంతా ఇలా ఉండగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి ఫొటోను విడుదల చేసి మరీ వెతుకున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తుండగానే.. ముంబయి పోలీసులకు మరో షాకింగ్ విషయం తెలిసింది. ముఖ్యంగా మరో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ఇంటి వద్ద కూడా ఎవరో రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు.
అయితే అదంతా సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయిందని తెలుస్తోంది. దాన్ని పరిశీలించిన పోలీసులకు.. అతడి ఇంటి పక్కన ఓ ఇనుప నిచ్చెన కనిపించింది. అలాగే నిందితుడు ఎత్తు, పరిమాణం.. సైఫ్‌పై దాడి చేసిన నిందితుడితో సరిపోలినట్లు గుర్తించారు. అంతేకాకుండా సైఫ్ అలీఖాన్‌పై దాడి జరగడానికి ఒకరోజు ముందు ఈ రెక్కీ జరిగిందని.. అలా నిందితుడి ఫస్ట్ టార్గెట్ షారుఖ్ ఖానే అయ్యుంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈక్రమంలోనే దర్యాప్తు చేస్తున్నారు. చూడాలి మరి ఈ రెండు కేసుల్లో నిందితుడు ఒక్కడేనా.. లేకే వేర్వేరు వ్యక్తులా అనేది.