ప్రపంచంలోనే ఎక్కువ మంది శాకాహారులు ఉన్న దేశం భారతదేశం. అలాంటి దేశంలో నాన్-వెజిటేరియన్ ఆహారాన్ని ఇష్టపడేవారి సంఖ్య చాలా ఎక్కువ. తాజాగా నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం వారానికి 78 శాతం మహిళలు, 70 శాతం పురుషులు మాంసాహారం తింటున్నారట. ఈ క్రమంలో మాంసాహారం ఎక్కువగా తినే రాష్ట్రాల్లో నాగాలాండ్ మొదటి స్థానంలో ఉండగా.. పశ్చిమబెంగాల్ రెండో స్థానంలో ఉన్నాయి. కాగా, తెలుగు రాష్ట్రాలు నాలుగో స్థానంలో ఉండడం గమనార్హం.