సనాతన ధర్మ పరిరక్షకుడుగా చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రాష్ట్రంలో సంక్రాతి ముసుగులో జరుగుతున్న ఈ విష సంస్కృతి కనిపించడం లేదా? అని వైయస్ఆర్ సీపీ నేత పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. అయన మాట్లాడుతూ..... ఇదేనా తెలుగు ప్రజలు సంప్రదాయకంగా జరుపుకునే సంక్రాంతి సంబరాలు? పేకాట క్యాసినోలు, అశ్లీల నృత్యాలు, గుండాట, కోతముక్కలు, మద్యం విక్రయాలేనా మన సంస్కృతి? ఇదేనా మన ధర్మం? ఎందుకు పవన్ కళ్యాణ్ పండుగ పేరుతో జరుగుతున్న ఈ దుర్మర్గంపైన నోరు మెదపడం లేదు? తన పార్టీ నేతలకు కూడా దీనిలో భాగంగా ఉన్నారని ఉపేక్షిస్తున్నారా? తుని నియోజకవర్గంలో ఏకంగా జిల్లా పరిషత్ పాఠశాలలొ కోడిపందాల బరులను నిర్వహించారు. విద్యాసంస్కరణలను అమలు చేస్తున్నాను అని చెప్పుకునే నారా లోకేష దీనికి సమాధానం చెప్పాలి? విద్యార్ధులకు చిన్నతనం నుంచే ఈ రకమైన జూదం, పందాలను అలవాటు చేస్తున్నారా? ఇందుకు కారకులైన వారిపైన చర్యలు తీసుకునే ధైర్యం ఈ రాష్ట్రానికి సీఎంగా ఉన్న చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లకు ఉందా? అని ప్రశ్నించారు.