రాష్ట్రంలో సంక్రాంతి సంబరాల ముసుగులో కూటమి నేతలు వేల కోట్ల రూపాయల అక్రమ ఆర్జనతో జేబులు నింపుకున్నారని వైయస్ఆర్ సీపీ నేత పోతిన వెంకట మహేష్ మండిపడ్డారు. సంబరాల పేరతో కూటమి నేతలు సంపదను సృష్టించుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఒక కొత్త విష సంస్కృతికి కూటమి నేతలు తెర తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొత్తం 1200 చోట్ల ఏర్పాటు చేసిన కోడిపందాల బరుల్లో మద్యం ఏరులై పారిందని, పేకాట క్యాసినోలు, అశ్లీల నృత్యాలతో సంక్రాంతి పండుగ పవిత్రత, సంప్రదాయాల అర్ధాన్నే పూర్తిగా మార్చేశారని ఆక్షేపించారు.