మహిళల క్రికెట్ లో మరో మెగా ఈవెంట్ కి సమయం ఆసన్నమైంది. మలేషియా వేదికగా జనవరి 18 శనివారం రోజు నుండి అండర్-19 టీ-20 ప్రపంచ కప్ ప్రారంభం కాబోతోంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. ఈ 16 జట్లను నాలుగు గ్రూపులుగా విడగొట్టారు. గ్రూప్ – ఏ: భారత్, మలేషియా, శ్రీలంక, వెస్టిండీస్. గ్రూప్ – బి: ఇంగ్లాండ్, ఐర్లాండ్, పాకిస్తాన్, యుఎస్ఏ. గ్రూప్ – సి: న్యూజిలాండ్, నైజీరియా, సమోవా, దక్షిణాఫ్రికా. గ్రూప్ – డి: ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ నేపాల్ స్కాట్లాండ్. గ్రూప్ 1 లో 6 టీమ్ లు, గ్రూప్ 2 లో మరో 6 జట్లు ఉంటాయి. ఈ సూపర్ సిక్స్ మ్యాచ్ లు ముగిసిన తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 లలో తొలి రెండు స్థానాలలో ఉన్న నాలుగు జట్లు సెమీ ఫైనల్స్ కి అర్హత సాధిస్తాయి. ఇక సెమీఫైనల్ లో గెలిచిన రెండు జట్లు ఫైనల్స్ లో పోటీ పడతాయి. ఫిబ్రవరి 2వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది. జనవరి 18 శనివారం రోజున ఈ టోర్నీ తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా – స్కాట్లాండ్ మద్య జరగనుంది. ఈ అండర్ 19 మహిళల t20 ప్రపంచ కప్ 2025 లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్ట్ వివరాలకి వస్తే.. ఈ మ్యాచ్ లను జియో స్టార్ ప్లాట్ ఫార్మ్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. ఇక సెమి ఫైనల్, ఫైనల్ మ్యాచ్ లను స్టార్ స్పోర్ట్స్ 2 లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.
భారత క్రికెట్ జట్టు: నికి ప్రసాద్ (కెప్టెన్), సానికా చాల్కే, జి త్రిష, కమలిని జి, భావికా అహిరే, ఈశ్వరి అవసరే, మిథిలా వినోద్, జోషిత VJ, సోనమ్ యాదవ్, పరుణికా సిసోడియా, కేసరి దృతి, ఆయుషి శుక్లా, ఆనందిత కిషోర్, MD , వైష్ణవి ఎస్.