సమాజంలో అందరితో పాటు మానసిక వికలాంగులకూ హక్కులు ఉన్నాయని, వారి కోసం పలు చట్టాలు ఉన్నాయని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ది తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాల ప్యానెల్ న్యాయవాదులకు, పారా లీగల్ వలంటీర్లకు స్థానిక న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ జిల్లా ప్రధాన న్యాయాధికారి జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారి బాలల సంరక్షణ కోసం స్నేహపూర్వక న్యాయ సేవల పథకం, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, మేధో వైకల్యాలు ఉన్న వ్యక్తులకు సంబంధించిన సేవల పథకాలు ఉన్నాయని, ఈ పథకాలను తమ చట్టాలను ఉపయోగిం చుకుని మానసికంగా బాధపడేవారు అభివృద్ధి చెందవచ్చని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో పలు చట్టాలపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి శిక్షకులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ ఎం.వెంకట హరినాథ్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎస్.మనోహర్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం.శివరామచంద్రరావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటి మెంబరు కె.వెంకటరమణయ్య, అసిస్టెంట్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ రేవతి జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.