ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 20, 2025, 11:03 AM

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కు పడిపోతున్నాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో శనివారం అర్ధరాత్రి నుంచి రెండు రాష్ట్రాల్లో చలిగాలులు విజృంభించాయి.ముఖ్యంగా ఏపీలోని అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు దారునంగా పడిపోయాయి. ఏజెన్సీ మొత్తం దట్టమైన పొగమంచు కప్పేసింది. ఆదివారం ఉదయం 10 గంటల వరకు పొగమంచు దట్టంగా అలముకుని కనిపించింది.అయితే వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో మంచు పోయిన తరువాత కూడా చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. అరకులోయలో ఆదివారం 5.9 డిగ్రీల మేర అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక చలితీవ్రత వల్ల మన్యంలోని స్థానికులు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల వరకూ మంచు అధికంగా కురవడంతో రోడ్లపై వాహన దారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. ఇక తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి చలి గాలులు వీయడం ప్రారంభించాయి. దీంతో వృద్దులు, చిన్నారులు బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 8 గంటల తర్వాత కూడా చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు.సాధారణంగా సంక్రాంతి సమయంలో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోతుంటాయి. ఈ ఏడాది కూడా ఇదే సీన్‌ రిపీట్‌ అయింది. సింగిల్ డిజిట్‌కే టెంపరేచర్లు పడిపోవటంతో చలితీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అటు తెలంగాణలోనూ చాలా ప్రాంతాల్లో 12 నుంచి 15 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com