రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అసమర్థ పాలన చేస్తోంది. దేని మీదా నియంత్రణ లేదు అని మాజీ మంత్రి, వైయస్‌ఆర్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. అయన మాట్లాడుతూ.... పత్రికల్లో అనుకూలంగా పుంఖానుపుంఖాలుగా కథనాలను రాయించుకుంటున్నారు. చంద్రబాబు గంటల తరబడి పొంతన లేకుండా ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని పిలపునిస్తున్నాడు. ఆయన, వారి కుమారుడు మాత్రం ఒక్కరినే కంటారు. బయటి వారికి మాత్రం ఎక్కువ మంది సంతానంను కనాలని పిలుపునిస్తున్నారు. అలాంటప్పుడు ఇద్దరి కంటే ఎక్కువ మందిని కంటే వారికి సంబంధించిన ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుందని ఎందుకు చెప్పరు? చంద్రబాబు సమర్థుడైన నాయకుడు, ఆలోచనాపరుడు కాదు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జరిగినవన్నీ మ్యాన్ మేడ్ యాక్సిడెంట్లే. నిత్యం చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ భజన చేస్తున్నాడు అని అన్నారు.