దాతలు, ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న కైలాస భూమిని త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు అన్నారు. ఆదివారం కైలాస భూమి చివరి దశ పనులను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. అంత్యక్రియలు చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని యుద్ధ్దప్రాతిపదికన పనులు పూర్తిచేసి త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సామాజికవేత్త నంబూరి రెడ్డియ్య, కంఠంశెట్టి శ్రీనివాస్, బూసి జయలక్ష్మి, ఎం. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.