ఏపీలో తీవ్ర విషాదం నెలకొంది. కడప నగరంలోని రామాంజనేయపురంలో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ప్రమాదవశాత్తు ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఇద్దరిని చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మృతిచెందిన వ్యక్తిని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.