ఫీజు కట్టలేదన్న కారణంగా శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం సెకండ్ ఇయర్ విద్యార్థి ఆబోతు టార్జాన్‌ను అర్ధరాత్రి బయటికి పంపేసింది. ఈ ఘటన కృష్ణా జిల్లా విజయవాడలోని కంకిపాడులో చోటుచేసుకుంది.
విద్యార్థి తండ్రి రాత్రికి రాత్రే రూ.20,000 ఫీజు చెల్లించి.. తన కుమారుడిని లోపలి అనుమతించాలని కోరాడు. అయితే కళాశాల యాజమాన్యం మాత్రం మిగతా ఫీజు కూడా కడితేనే అనుమతిస్తామని చెప్పింది. దాంతో తండ్రీకొడుకులిద్దరూ అర్ధరాత్రి కాలేజీ ముందు బైఠాయించి నిరసన తెలిపారు.