చాంపియన్స్ ట్రోఫీ-2025 వన్డే సమరానికి సమయం దగ్గర పడుతోంది. మినీ వన్డే వరల్డ్‌కప్‌గా భావించే చాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. వన్డే ప్రపంచకప్-2023లో సత్తా చాటి ఏడు టీమ్‌లు అర్హత సాధించగా, ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్‌కు నేరుగా ఎంట్రీ లభించింది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు పాకిస్థాన్, దుబాయ్ వేదికగా ఈ మెగాటోర్ని జరగనుంది. ఎనిమిదేళ్ల తర్వాత ఈ టోర్నమెంట్ జరుగుతుండడంతో క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 2017లో చివరిగా చాంపియన్స్ ట్రోఫీ జరిగిన సంగతి తెలిసిందే. రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో చాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది. 8 జట్లను రెండు గ్రూపులుగా (ఏ, బీ) విభజించారు. ప్రతి జట్టు తమ గ్రూపులోని ప్రతి ఇతర జట్టుతో తలపడుతుంది. ఒక్కో గ్రూపు నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకుంటాయి. సెమీ ఫైనల్‌లో విజేతలుగా నిలిచిన రెండు టీమ్‌లు ఫైనల్‌లో ఢీకొంటాయి. నాకౌట్ చేరేందుకు ప్రతిజట్టు గట్టిగానే ప్రయత్నించే అవకాశం ఉన్నందున ఈసారి మ్యాచ్‌లు క్రికెట్ అభిమానులకు రెట్టింపు వినోదాన్ని పంచనున్నాయి. గ్రూప్ A లో ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ టీమ్‌లున్నాయి. గ్రూప్ Bలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ ఉన్నాయి.
ఇండియా: కెప్టెన్: రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్: శుభమన్ గిల్, న్యూజిలాండ్ కేప్టెన్: మిచెల్ సాంట్నర్, పాకిస్తాన్ కేప్టెన్: బాబర్ అజమ్, వైస్ కెప్టెన్: మహ్మద్ రిజ్వాన్, బంగ్లాదేశ్ కెప్టెన్: నజ్ముల్ హొస్సేన్, ఇంగ్లండ్ కెప్టెన్: జోస్ బట్లర్, వైస్-కెప్టెన్: హ్యారీ బ్రూక్, ఆస్ట్రేలియా కెప్టెన్: పాట్ కమిన్స్, దక్షిణాఫ్రికా కెప్టెన్: టెంబా బావుమా, అఫ్గానిస్థాన్ కెప్టెన్: హష్మతుల్లా షాహిదీ, వైస్ కెప్టెన్: రహమత్ షా.