ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా, ఆయన కుటుంబంపైనా అసభ్యకర వ్యాఖ్యలు చేసారని అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డిపై ఎట్టకేలకు పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. రాప్తాడు పోలీసుస్టేషన్‌లో శనివారం రాత్రి ఆయనపై కేసు నమోదు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో 2022 నవంబరులో తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలోని ఎంపీపీ గదిలో ఆ పార్టీ కార్యకర్తలతో కలిసి చంద్రబాబును, లోకేశ్‌ను, వారి కుటుంబ సభ్యులను దూషించారు. ఆ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని టీడీపీ నాయకులు 15 రోజుల క్రితం ఎస్పీ జగదీశ్‌కు ఫిర్యాదు చేశారు.