ప్రజాసమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాలు చూపడమే లక్ష్యమని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ప్రజల నుంచి వినతులు స్వీకరించి మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి ఆహర్నిశలు కృషి చేస్తున్నానన్నారు. భవిష్యత్తులో సమస్యల రహిత నగరంగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానన్నారు. వచ్చిన వారి నుంచి సమస్యలను అడిగి తెలుసుకుని, సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. శివప్రసాద్, రెడ్డి నాగరాజు, బెల్లంకొండ కిషోర్, మారం హనుమంతరావు, ఎ.తిరుపతి పాల్గొన్నారు.శెట్టిబలిజ సంక్షేమ సంఘం ముద్రించిన నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వీరవల్లి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు కోడి దుర్గారావు, వై.లక్ష్మీనారాయణ తదితరులు పా ల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ శెట్టిబలిజల సంక్షేమ సంఘం అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. మధుసూదన్‌రావు, గుబ్బల రామకృష్ణ, కె.శ్రీను, చింతపల్లి గోవింద్, జి.నాని, ప్రసాద్, లక్ష్మినారాయణ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.