చైనాలో ఇటీవల ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా కారు నడిపి 35 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడికి మరణశిక్ష పడగా న్యాయస్థానం ఆదేశాల మేరకు అతడికి శిక్ష అమలు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఫాన్ వీకియూ (62) గతేడాది నవంబర్ 11న ఝుహాయ్ నగరంలో కారుతో జనంపైకి దూసుకెళ్లడంతో 35 మంది మరణించగా అనేక మంది గాయపడ్డారు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా కోర్టు ఉరిశిక్ష విధించింది.