విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే కుట్రలో భాగంగానే కేంద్రం ప్యాకేజీ ప్రకటించి తాత్కాలికంగా ప్రలోభ పెట్టాలని చూస్తున్నారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కూటమి పార్టీ నాయకులు సైతం ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నారే తప్ప, ప్రైవేటీకరణ ఆగిపోయిందని చెప్పడం లేదని ఆయన గుర్తు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రితో చెప్పిస్తే, స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులతో పాటు, ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలగిపోతాయని తేల్చి చెప్పారు. తిరుపతి తొక్కిసలాట ఘటనను సుమోటోగా స్వీకరించి విచారణ చేయాలని హైకోర్టుకు లేఖ రాసినట్టు విశాఖలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ వెల్లడించారు.