ఉపాధ్యాయ, ఉద్యోగులకు 12వ వేతన సవరణ సంఘాన్ని తక్షణమే నియమించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అకడమిక్ కమిటీ సభ్యుడు సాంబశివుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి నగిరి శ్రీనివాసులు కోరారు. నంద్యాలలోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆదివారం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 7వ వేతన సవరణ సంఘం గడువు 2025 డిసెంబరు వరకు ఉన్నప్పటికీ సంవత్సరం ముందే 8వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా నాయకులు పుల్లయ్య, రవి, పవన్‌కుమార్, మునిస్వామి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.