వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, రాజ్యసభ మాజీ సభ్యుడు మాజీ చైర్మన్ పాలవలస రాజశేఖరం మరణం పార్టీకి తీరని లోటని ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశీల రఘురాం అన్నారు. ఈ నెల 14న అనారోగ్యంతో రాజశేఖరం తుదిశ్వాస విడిచారు. ఆయన కుటుంబ సభ్యులను సోమవారం వైయస్ఆర్‌సీపీ నేతలు పరామర్శించారు. రాజశేఖరం స్వగృహంలో ఆయన సతీమణి పాలవలస ఇందుమతి, కుమారుడు ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, కుమార్తె పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జేసీఎస్ కన్వీనర్ హర్షవర్ధన్ రెడ్డి, టిడ్కో మాజీ చైర్మన్ ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.