వైసీపీ పార్టీ అభివృద్ధి కోసం గ్రామ స్థాయి నుండి పని చేద్దాం అని మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ పేర్కొన్నారు. మంగళవారం గోరంట్ల మండలం పులేరులో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ దంపతులకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జగనన్న ను మరో మారు సీఎం ను చేసుకుందాం అన్నారు.