నల్ల ద్రాక్షలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి. వీటిలో విటమిన్ బితో పాటు ఫైబర్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి మూలకాలు లభిస్తాయి.. రెస్వెరాట్రాల్, ఫ్లేవనాయిడ్ష్, ఆంథోసైనిన్స్ వంటి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడి నుండి శరీరాన్ని కాపాడుతుంది. నల్లద్రాక్షలో ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి సమ్మేళనాలు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి. క్షీణత, కంటి శుక్లం వంటి ప్రమాదాలు దూరమవుతాయి. నల్లద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్స్ మంట, చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
నల్లద్రాక్షలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మనలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఎముకలకు మంచిది. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడి, బోలు ఎముకల సమస్య రాకుండా చేస్తుంది. అంతేకాదు..ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి బాడీలోని ఫ్రీ రాడికల్స్‌ని బ్యాలెన్స్ చేస్తాయి. దీంతో కొంతవరకూ క్యాన్సర్ తగ్గుతుంది. నల్లద్రాక్షలో ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి సమ్మేళనాలు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి. క్షీణత, కంటి శుక్లం వంటి ప్రమాదాలు దూరమవుతాయి. నల్లద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్స్ మంట, చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు నల్ల ద్రాక్ష తినటం మంచిది. ఇందులో అతితక్కువ క్యాలరీలు ,ఫైబర్ అధిక మొత్తంలో నీరు ఉంటుంది. నల్ల ద్రాక్షలో సహజ చక్కెరలు ఉండటం వల్ల మధుమేహం బాధితులకు మంచి పండుగా నిపుణులు చెబుతున్నారు.