ఎప్పుడైనా బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు వీటిని తీసుకుంటారు. అయితే…వీటి రుచి కాస్త వగరుగా ఉంటుంది. ORSలలో గ్లూకోజ్ సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్, సోడియం సిట్రేట్ ఉంటాయి. ఈ మూడూ శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడతాయి. వీటి వల్లే రుచి కాస్త అదో రకంగా ఉంటుంది. కానీ… ఇందులోనూ రకరకాల ఫ్లేవర్స్ కలిపి యాపిల్ అని, ఆరెంజ్ అని..మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. కాస్త టేస్టీగా ఉండేలా వీటిని తయారు చేస్తున్నారు. వీటిని ముఖ్యంగా పిల్లల్ని ఉద్దేశించే తయారు చేస్తున్నారు. పిల్లలు ఏ మెడిసిన్‌నైనా కాస్త రుచిగా ఉంటేనే తీసుకుంటారు. అందుకే..ORS లను కూడా అలా మార్చేస్తున్నారు. కాకపోతే.. ఇక్కడే ఓ సమస్య వచ్చి పడుతోంది. వీటిని రుచికరంగా మార్చాలని చెప్పి…విపరీతంగా షుగర్ కంటెంట్ యాడ్ చేస్తున్నారు. అది కూడా మోతాదుకు మించి కలుపుతున్నారు. ఈ విషయంలో ఓ పద్ధతంటూ లేకుండా కంపెనీలు ఇష్టమొచ్చినట్టుగా షుగర్ యాడ్ చేసేస్తున్నాయి. వీటిని తాగడం వల్ల పిల్లల్లో షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి.
షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఇలాంటి డ్రింక్స్ తీసుకోవడం వల్ల రీహైడ్రేషన్ అవకపోగా..కొత్తగా డయేరియా లాంటి సమస్యలు వస్తాయి. పైగా..నకిలీ ORSలలో సోడియం లెవల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి వాటిని తాగితే..శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ తప్పుతుంది. ఒక్కోసారి మెదడు వాచిపోయే ప్రాణాలకే ముప్పు వస్తుండొచ్చు. దీంతోపాటు మరి కొన్ని సమస్యలూ వచ్చే ప్రమాదముంది. మార్కెట్‌లో చాలా ఫేక్ ORS ప్రొడక్ట్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. ఒక్కోసారి వాటిని గుర్తించడం కూడా కష్టంగా మారుతోంది. చాలా మంది వీటి గురించి సరైన అవగాహన లేక వాటినే కొని తాగేస్తుంటారు. ఇలాంటి ప్రొడక్ట్స్ విషయంలో కల్తీకి పాల్పడితే అది ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండా కాలంలో వీటికి డిమాండ్ విపరీతంగా ఉన్నప్పటికీ మిగతా రోజుల్లోనూ జ్వరాలు వచ్చినప్పుడు వీటి సేల్స్ పెరుగుతున్నాయి. డాక్టర్లు ఎప్పుడైనా ORS సాచెట్స్ కొనుక్కుని ఆ పౌడర్‌ని నీళ్లలో కలుపుకుని తాగమని సలహా ఇస్తారు. వీటి వల్ల శరీరంలో ఎలక్ట్రో లైట్స్, ఫ్లూయిడ్స్ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి. ఇంత మంచి చేసే ORS లలో నకిలీని గుర్తించడమే చాలా కీలకం. ఇతర వివరాల కోసం ఫుల్ వీడియోను చూడండి.