చలి ధాటిని తట్టుకునేందుకు చాలా మంది స్వెటర్స్ వేసుకుంటున్నారు. వీటిని రెగ్యులర్‌గా వేయడం వల్ల అవి పోగులు లేచి చూడ్డానికి పాతబడినట్లుగా ఉంటుంది. పైగా బోర్ కూడా కొడుతుంది. అలా అని ఆ స్వెటర్స్‌ని పక్కన పెట్టేయలేం. కొత్తవి కొనడానికి డబ్బు పెట్టలేం. కొంతమంది అయితే, ప్రతీసారి ఇవే స్వెటర్స్ వేసుకుంటే ఎవరైనా ఏమనుకుంటారోనని చలి ఉన్నా స్వెటర్స్‌ని వాడరు. ఇక నుంచి అలా కాదు.. మీరు మీ స్వెటర్‌ని కొత్తగా మార్చుకోవచ్చు. దీంతో చూసిన వారే మిమ్మల్ని ఇది ఎక్కడ కొన్నావని మరీ అడుగుతారు. మరి ఆ టిప్స్ ఏంటి, వాటిని ఫాలో అయి పాత స్వెటర్స్‌ని కొత్తగా ఎలా వాడుకోవచ్చో తెలుసుకోండి.
ఎంబ్రాయిడరీ
అవును, ఇది చాలా క్రియేటివ్ ఐడి అనుకోవచ్చు. మీ స్వెటర్‌పై మంచి కాంట్రాస్ట్ కలర్ థ్రెడ్‌తో మంచి డిజైన్ లేదా ఏదైనా కోట్ బాయ్స్, గర్ల్స్‌కి సంబంధించిన వర్డ్స్‌ని ఎంబ్రాయిడరీ చేయండి. దీంతో న్యూలుక్ వస్తుంది. తిరిగి వాటిని వేసుకోవచ్చు. ఇవి చూడ్డానికి చాలా బాగుంటాయి కూడా.
క్లచ్చర్‌తో మీ జుట్టును ఇలా స్టైల్ చేసుకోండి..
బటన్స్
మరో క్రియేటీవ్ ఐడియా ఏంటంటే మంచి బటన్స్, హుక్స్, షైనీగా కనిపించే పూసలు, రాళ్ళని చీరలపై కుట్టినట్లుగా అక్కడక్కడ కుట్టండి. ఇది కూడా స్టైలిష్‌గా ఉంటుంది. హ్యాపీగా కొత్తవాటిలా కూడా మెరిసిపోతాయి స్వెటర్స్.
జ్యువెలరీ
అదేంటి స్వెటర్స్‌పై జ్యువెలరీ ఏంటి అనుకోవద్దు. కొన్ని ట్రెండీ చైన్స్, నెక్‌పీస్ వంటివి తీసుకొచ్చి స్వెటర్స్ వేశాక కూడా స్టైల్ చేయండి. దీంతో స్వెటర్ చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది. మీ లుక్కే మారిపోతుంది కూడా.
బ్రూచెస్
ఇవి చాలా మందికి తెలిసే ఉంటుంది. బ్రూచెస్‌ని మనం చీరలు, సూట్స్ ఎలాంటి వాటిపైకైనా స్టైల్ చేస్తుంటారు. దీని వల్ల లుక్ మరింత ఎన్‌హాన్స్ అవుతుంది. మంచి షైనీ బ్రూచెస్‌ని తీసుకొచ్చి స్వెటర్‌పై పిన్ చేయండి. ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇది ఈజీగా కూడా ఉంటుంది. ఇది మగవారు, ఆడవారు ఎవరైనా ఫాలో అవ్వొచ్చు.
ఎవరైనా
ఇప్పుడు చెప్పిన టిప్స్ అన్నీ కూడా ఆడవారు, మగవారి స్వెటర్స్ ఎవరికైనా బాగుంటాయి. ఈ చిట్కాలను ఫాలో అవ్వడం వల్ల స్వెటర్ పాత లుక్ నుంచి కొత్తగా మారుతుంది. అందంగా కనిపిస్తుంది. దీంతో మీరు కూడా మంచి వైబ్‌తో చిల్లీ వింటర్‌ని ఎంజాయ్ చేస్తారు. మరింకెందుకు బాధ.. హ్యాపీగా మీ పాత స్వెటర్‌ని కొత్తగా మార్చుకోండి.