ఈ డ్రైఫ్రూట్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..? రోజూ కొన్ని వాల్‌నట్స్ తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా, తక్కువ ముడతలతో మెరుస్తూ ఉండటమే కాకుండా..
అనేక ఇతర శరీర ప్రాముఖ్యతలు కూడా పొందవచ్చు. ఇవి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, విటమిన్ బి వంటి పోషకాలను కలిగి ఉంటాయి. ఈ పోషకాలు చర్మాన్ని హైడ్రేట్ చేసి దానిని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి.వాల్‌నట్స్ లో ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని లోతుగా మాయిశ్చరైజ్ చేస్తాయి. ఇది చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండటానికి సహాయపడుతుంది. చర్మం పొడిబారితే దానికి మరింత సమస్యలు తలెత్తుతాయి. కానీ వాల్‌నట్స్ ఈ పరిస్థితిని నివారించి చర్మం మృదువుగా, నిగనిగలాడుతూ ఉంచుతుంది.
ఈ రోజుల్లో చాలామంది చిన్న వయస్సులోనే ముడతల సమస్యతో బాధపడుతున్నారు. వాల్‌నట్స్‌లో ఉన్న యాంటీఆక్సిడెంట్లు చర్మం వృద్ధాప్య సంకేతాల నుండి రక్షణ కల్పిస్తాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చర్మం యవ్వనంగా, ముడతలు లేకుండా ఉండటానికి చాలా సహాయపడుతుంది.
మొటిమలు ఎక్కువగా ఉండే వారు వాల్‌నట్స్ తీసుకుంటే వారికి మంచి ఫలితాలు వస్తాయి. ఇందులో ఉన్న జింక్, చర్మంలో నూనె ఉత్పత్తిని నియంత్రించి మొటిమలు తగ్గించడంలో సహాయపడుతుంది. జింక్, చర్మంలో బ్యాక్టీరియా పెరగకుండా నియంత్రణ సాధిస్తుంది. దీంతో మొటిమల సమస్య తగ్గిపోతుంది.
చర్మంపై మచ్చలు
చర్మంపై మచ్చలు, నల్లటి వలయాలు పోవడం కోసం చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. వాల్‌నట్స్‌లో ఉన్న విటమిన్ ఇ, బి కాంప్లెక్స్, చర్మం సమానమైన రంగును అందించడంలో సహాయపడతాయి. ఇవి చర్మ ఛాయను మెరుగుపరచడం ద్వారా మచ్చలు తగ్గించి, చర్మాన్ని అందంగా తయారు చేస్తాయి.
అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
రోజుకు 28 గ్రాముల వాల్‌నట్స్ తీసుకోవడం ద్వారా మీ చర్మం ఆరోగ్యం బాగుంటుంది. శరీరానికి ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. కనీసం నాలుగు వాల్‌నట్స్ రోజూ నానబెట్టి తినడం, శరీరానికి, చర్మానికి పోషకాలు అందించడానికి చాలా మంచిది. వాల్‌నట్స్ డైరెక్ట్‌గా కూడా తినొచ్చు, కానీ నానబెట్టి తినడం శరీరానికి మంచి ఫలితాలను అందిస్తుంది.