ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'టీ ' మానేసి చూడండి

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Jan 26, 2025, 11:55 AM

మన టీ ప్రియులు, ఉదయం లేవగానే వేడి వేడిగా ఒక కప్పు టీ తాగకపోతే రోజువారి దినచర్య అసలు ముందుకు సాగానే సాగదు. టీ తాగితే వచ్చే ఫీలింగ్ అంతా ఇంతా కాదు.ఉదయం టీ తో స్టార్ట్ అయితే ఆ రోజంతా హాయిగా, హుషారుగా ఉంటారు. దీనికి గల కారణం టీలో ఉండే కెఫిన్, కెఫిన్ కి అలవాటు పడినవారు రోజు మొత్తంలో లెక్కలేనన్ని సార్లు టీ కి పడిపోతున్నారు. అయితే ఈ టీ ప్రియులకు ఒక సవాల్.. మీరు నెలరోజుల పాటు టీ తాగడం మానేస్తే మీ శరీరంలో ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో ఒకసారి తెలుసుకుందాం… మనదేశంలో దాదాపు 90 శాతం మందికి ఇష్టమైన పానియం ఏదైనా ఉంది అంటే అది ఫస్ట్ టీ మాత్రమే. అని లేవగానే ఒక కప్పు టీ తాగాలనే కుతూహలం కలుగుతుంది. మంది రోజుకు ఎప్పుడు పడితే అప్పుడు టీ తాగుతూనే ఉంటారు. ఎందుకంటే ఇది ఒక రకమైన శక్తిని, ఉషారుని ఇస్తుంది. అందుకే టీ తాగకపోతే తలనొప్పి విపరీతంగా వస్తుంది. ఏదైనా ఒత్తిడితో లోనైనా,ఆందోళనకు గురైన టీ పరిష్కారం అని భావిస్తారు. తే మనం టీ తో పాటు అందులో చక్కెర వేసుకుని తాగుతుంటాం. టీలో చెక్కర లేనిదే టీ తాగడానికి ఇష్టపడరు. రోజు తాగే టీ లో ఉండే చక్కెర కంటెంట్ ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని విషయం మీకు తెలుసా…?


టీ ప్రియులకి టీ ని నెలరోజుల పాటు తాగకుండా ఉండాలి అంటే ఒక పెద్ద సవాలే. మీ ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాల్సి ఉంటే మాత్రమే అదుపు చేయాల్సిన అవసరం చాలా ఉంది. తాగే టీ లో చక్కెర స్థాయి ఎక్కువగానే ఉంటుంది. ఇటీలో క్యాలరీలు పెరుగుతాయి. ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం టీ లో చెక్కరలు అధికంగా ఉంటే జీర్ణ వ్యవస్థ దెబ్బతీస్తుంది.కావున ఒక నెలపాటు స్వీట్ తిని తాగడం మానేయండి. తద్వారా మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే మీ శరీర బరువును కూడా తగ్గించుకోవచ్చు.


టీ తాగడం నెలరోజుల పాటు మానేస్తే అనేక రకాల ఆరోగ్య సమస్యలు మీకు దరి చేరవు. నెల రోజులపాటు స్వీట్ టీ ని తీసుకోకుండా ఉంటే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది అని అధ్యయనాల్లో నిరూపించారు. తియ్యగా ఉండే టీ ని తాగితే చర్మం పై మొటిమలు, పొక్కులు వంటివి ఏర్పడతాయి. టీ తాగితే శరీరంలో అధిక వేడి కూడా ఉత్పత్తి అవుతుంది. ద్వారా మొటిమలు, పొక్కులు ఏర్పడతాయి. మీ చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే స్వీట్ తిని తాగకపోవడం మంచిది. కటీని పూర్తిగా మానేయడం వల్ల నా తలనొప్పి సమస్యను కూడా దూరం చేసుకోవచ్చు.


టీ మానేస్తే లాభాలు:
కొంత మందికి టీ తాగకపోవడం వల్ల వచ్చే తలనొప్పి, టీ మానేయటం వలన కూడా అతని నొప్పి క్రమంగా తగ్గిపోతుంది. అలవాటు చేసుకుని వారికి తలనొప్పి ఉండదు. అలవాటు చేసుకున్న వారికి మాత్రమే తలనొప్పి ఉంటుంది.ఎందు కంటే ఇందులో కెఫీన్ ఉండడంవల్ల టీ తాగకపోతే తలనొప్పిని కలిగిస్తుంది. కావునాటి అలవాటు లేని వారికి, అలవాటు కూడా ఉండదు కాబట్టి,టీ ని క్రమం క్రమంగా తగ్గిస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి.అలాగే టీ ని క్రమం క్రమంగా తాగడం తగ్గిస్తే శరీరంలోని కెఫిన్ శాతం కూడా తగ్గుతుంది. దిని వల్ల నిద్ర పోవడానికి ఎంతో సహాయపడుతుంది.దీనివల్ల ఒత్తిడి కూడా తగ్గిస్తుంది. నెల రోజులపాటు టీనే మానేస్తే డిహైడ్రేషన్ సమస్య తగ్గుతుంది. ఇది సెల్లు – డ్యామేజింగ్ ఫ్రీ రాడికల్స్ ను కూడా తగ్గిస్తుంది.టీ తాగే అలవాటు మానుకుంటే గుండెల్లో మంట కూడా తగ్గుతుంది. గుండె కొట్టుకునే వేగం కూడా హెచ్చుతగ్గులు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. చేతులు వణుకుతూ ఉంటే టీ తాగడం వల్ల సమస్య తీవ్రమవుతుంది. ఆగే టీ ని నెల రోజులు పాటు మానేస్తే అధిక రక్తపోటు సాధారణ స్థితికి వస్తుంది. కావున ఒక నెల రోజులు పాటు టీ ని మానేసి చూడండి. ఫలితం మీకే అర్థమవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com