ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ కు చోటు దక్కలేదు. అంతే కాకుండా ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్ నుంచి కూడా అతడిని తప్పించారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందే మహ్మద్ సిరాజ్ కు టీమిండియాలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీలో జస్ప్రీత్ బుమ్రా ఆడడం అనుమానాస్పదంగానే ఉంది. వెన్నునొప్పి చికిత్స కోసం అతను న్యూజిలాండ్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీనిని పరిశీలించిన తర్వాత, బుమ్రాకు ఎక్కువ విశ్రాంతి ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోనున్నారు. బుమ్రాకు మరింత విశ్రాంతి అవసరమని న్యూజిలాండ్ మెడికల్ రిపోర్ట్ సూచిస్తే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి అతడు తప్పుకోవడం ఖాయం. అతనికి బదులు మహ్మద్ సిరాజ్ జట్టులోకి ఎంపికయ్యే అవకాశం ఉందని కూడా సమాచారం. బ్యాకప్ ప్లేయర్‌ని సిద్ధం చేయాలని ఇప్పటికే ఆదేశాలు అందాయని, బుమ్రా 100% ఫిట్‌గా లేకుంటే, ఛాంపియన్స్ ట్రోఫీకి మహ్మద్ సిరాజ్‌ను పంపాలని సెలక్షన్ కమిటీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.