ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇస్తానన్న జాబ్‌ కేలండర్‌ ఎక్కడ లోకేష్?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 31, 2025, 09:09 AM

ప్రతి సంవత్సరం జాబ్‌ కేలండర్‌ విడుదల చేస్తాం. రికార్డు చేసుకో.. డేటు టైము రాసుకో.. పారిపోయే బ్యాచ్‌ కాదు నేను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జాబ్‌ కేలండర్‌ ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు.. ఎప్పుడు ఎగ్జామ్స్‌.. ఎప్పుడు ఇంటర్వ్యూలు.. ఎప్పుడు ఆఫర్‌ లెటర్లు ఇచ్చేది చాలా స్పష్టంగా 2025 జనవరి ఫస్ట్‌నే ప్రకటిస్తాం’ అని ఎన్నికలకు ముందు 2024 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకు యువగళం సభల్లో నారా లోకేశ్‌ ఆర్భాటంగా చెప్పారు కదా మరి ఎందుకు ఇప్పటివరకు ఇవ్వలేదు అని  వైసీపీ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. వారు మాట్లాడుతూ...... తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచాయి. జనవరి ఒకటో తేదీ వెళ్లిపోయింది. ఫిబ్రవరి వస్తోంది. జాబ్‌ కేలండర్‌ ప్రకటన మాత్రం లేదు. ఇప్పటిదాకా జాబ్‌ కేలండర్‌ ఏమైందో పట్టించుకున్నదే లేదు. లోకేశ్‌ మాత్రమే కాదు.. నారా చంద్ర­బాబు సైతం ఇదే హామీని పదేపదే ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తవుతున్నా ఇంతవరకు ఏపీపీఎస్సీ నుంచి ఒక్క ప్రకటనా వెలువడలేదు. పైగా గత ప్రభుత్వంలో ఇచ్చిన గ్రూప్‌–1, 2 మెయిన్స్‌ పరీక్షలను పలుమార్లు వాయిదా వేశారు. సంస్కరణల పేరుతో గ్రూప్‌–2లో ఉన్న 10 రకాల ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను గ్రూప్‌–1లో కలిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత పెరుగుతుండడంతో జగన్‌ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు కొత్త తేదీలను చేర్చి డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌గా లీకులిచ్చి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. మరోపక్క రాష్ట్ర అటవీ శాఖలోని 689 ఖాళీల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతించి 10 నెలలు దాటినా, వాటికి నోటిఫికేషన్‌ ప్రకటించలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించకపోగా, కొత్తగా 150 గ్రూప్‌–1 పోస్టులు సృష్టిస్తున్నట్టు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొనడం చూస్తుంటే కూటమి ప్రభుత్వ పెద్దలు అబద్ధాలతో నెట్టుకొస్తున్నారని స్పష్టమవుతోంది అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com